Creative works from Telusuna Members

Vedaga Varamula

Ramakantha Rao Chakalakonda

వేడగ వరముల నందించు వాడు,
వడ్డికాసుల వాడు, వర వేంకటేశుడు. ||వేడగ||

1. చేడియ చెక్కిలి చిలిపిగ మీటి,
వేడి వలపులు, వన్నెలు దోచి,
పాడిగ యిరువురు భార్యలతోటి
ఆడి, పాడెడి అందాల దేముడు. ||వేడగ||

2. కూడి నాంచారితో కులుకులు జూపి,
ఆడి ఆండాలుతో అలరులు దోచి,
జోడుగ పద్మతో చేలము బట్టి,
వేడుక జేసెడి వేంకటనాధుడు. ||వేడగ||

3. అడరి మంగకు అలకలు తీర్చి, పూ
బోడి పద్మతో పంతము లాడి,
ఏడు కొండల ఎత్తున వెలిగే
వాడి వలపుల వేంకట రమణుడు. ||వేడగ||

రమాకాంతరావు చాకలకొండ
Saturday, June 02, 2007 Cincinnati OH USA


#maa telugu talliki mallepU daMDaa#

Back to list