రాగం: హిందోళం ( Ragam: Hindolam) తాళం: ఆది ( Adi Talam) పల్లవి. వరముల నీయవే వరదా! శ్రీ శా! శరణము నీయవే శ్రీ వేంకటేశ! ||వరముల|| 1. చరణ కమలముల సేవల నీయవే హరి దాసుల సత్సంగతి నీయవే నిరతము నిన్నే మదిలో తలచెడి చిత్త శుద్ధిని శాంతము నీయవే. ||వరముల|| 2. తిరుమల దర్శన భాగ్యము నీయవే శ్రీపతి! స్నేహ సంపద నీయవే, కరుణాకర! ఓ తిరుమల వరదా! నెరనమ్మితి కైవల్యము నీయవే. ||వరముల|| రచన: రమాకాంతరావు చాకలకొండ |
#maa telugu talliki mallepU daMDaa# |