అప్పుడు యిప్పుడు రామ దాసుడే, ఎప్పుడూ శ్రీహరి పాద దాసుడే మెప్పు గొప్పలు ఒప్పకోక, తబ్బిబ్బు గాని చరణ దాసుడే. ||అప్పుడు|| 1. రెప్ప పాటులో ముగియు జీవితం, రొ ప్పు రావిడుల రోత జన్మము నొప్పులు తిప్పలు నాన బాధల, నోగ్గి పోవు యీ నరక కూపము, అప్పు ఆరడుల అలతల తోటి, అలసట నొందే అల్ప జన్మము, నొప్పు శ్రీ పతి పాదములందే నన్ని మరచి యీ దాసుడు అల్పుడు. ||అప్పుడు|| 2. చెప్పు చేతల కూలి జీవితం, చిత్త శుద్ధిని శాంతము విడచి, తిప్పులు పడుచూ తల ఒంపులతో, తల ఒగ్గి కడు దాస్యము చేయుచు, చెప్పరాని చెడు సాంగత్యములతో, చీకు చింతలు బాధలు పడచూ ముప్పు తప్ప మాధవుని పదముల, ముదము నొందు హరి పాద భృత్యుడు. ||అప్పుడు|| రమాకాంతరావు చాకలకొండ Friday, June 15, 2007 Cincinnati, OH USA |
# |