ఎందరికో యీతడే యిల వేలుపు, అందరికి ఆతడే ఆత్మ బంధువు. || ఎందరికో|| 1. చెంది శ్రీ వేంకటాద్రి శిఖరాలలో వెలసి పొందగు పైడి మందిర సుందరుడై తానిలచి కందువైన కైవల్యము కనికరించి యిచ్చువాడు ఇందిరా నాధుడితడే అందరికి దైవము. || ఎందరికో|| 2. కంటికి వెలుగు తానై కనుచూపు లందించి, ఇంటింటి యిల వేల్పుగ ఎల్లర బ్రోచే వాడు, మింటి రంగు వాడు, మరువపు దండల వాడు వింటిని, కంటిని వీడే విశ్వజన పోషకుడు. || ఎందరికో|| రమాకాంతరావు చాకలకొండ June 14, 2007 Cincinnati, OH USA |
#maa telugu talliki mallepU daMDaa# |