Creative works from Telusuna Members

KalushamuluKaraginchi

Ramakantha Rao Chakalakonda

రాగం: కురంజి రాగం తాళం: ఆదితాళం

కలుషములు కరగించి కాపాడు మంత్రము
తలచిన చాలును తీరును తాపము. ||కలుషములు||

1. తొలుత బ్రహ్మాలకు తత్వము బోధించి,
నలువ కర్తవ్యము నెరపిన మంత్రము,
వేల్పులచే ఒద్దికగ ఉదధిని చిలికించి
ఫలముగ అమృతము పంచిన మంత్రము. ||కలుషములు||

2. బలిమి దానవులను బహురీతుల తునిమి,
కలవరము లేకుండ కాపాడు మంత్రము,
చెలిమిగ భక్తులకు చింతలను తీర్చిన
అలమేలు మంగపతి అమృత మంత్రము. ||కలుషములు||

3. పాల కడలి ప్రభలు పల్లవింపగ జేయు
కలిమిని సమకూర్చు కేశవ మంత్రము,
ఇలన వేంకటగిరిన వెల్లువగ ఉదయించి
చల్లగ ఎల్లరిని కాపాడు మంత్రము. ||కలుషములు||

చాకలకొండ రమాకాంతరావు
Saturday, June 16, 2007 Cincinnati OH USA


#maa telugu talliki mallepU daMDaa#

Back to list