Creative works from Telusuna Members

Tanuvu Unnavarke

Ramakantha Rao Chakalakonda

తనువు ఉన్న వరకే తమకాలు, తాపాలు
తనువు వీడిన నాడే సమయు శోకాలు. ||తనువు||

1. వీడు మదిని కమ్ము వ్యామోహ భావాలు,
చేడు చేయు చపల కామ క్రోధాలు,
తోడు రావు వెంట తామస భావనలు,
నీడగ నీ కీర్తి ఘన కిరీటాలు. ||తనువు||

2. పాడిగ దరి చేరు పాప పుణ్యాలు,
కీడు చేసిన కర్మ ఘోర ఫలితాలు,
జోడుగ జత చేరు సంచిత కర్మలు,
నాడు చేసిన అన్ని మంచి కార్యాలు. ||తనువు||

3. ఆడు నాటకములో అందరము పావులే,
నడిపించు వాడు ఆ నళినాయతాక్షుడే, కా
పాడు అందరిని కూరిమిగ దరినున్న,
వేడు వేంకటపతి విమల చరణాలు. ||తనువు||

చాకలకొండ రమాకాంతరావు
Thursday, June 21, 2007 Cincinnati OH USA


#maa telugu talliki mallepU daMDaa#

Back to list