పల్లవి. రామా నను బ్రోవర, దశరధ రామా నను బ్రోవర. || రామా నను || అనుపల్లవి. నీల మేఘ శ్యామ నీవే నాకు దిక్కు మొక్కుర! || రామా నను || 1. అంతరంగ మందు నిన్నే, ఎంతగానో స్థిరము జేసి, చింతలన్ని జార విడచి, సంతసాన స్మరణ చేతు. || రామా నను || 2. శాంత చిత్త సుగుణ ధామ ఎంత వాడ నయ్య స్వామి, పంత మంత కొంత వీడి చెంత చేర రావయ్య. || రామా నను || 3. కరుణ సింధూ కృపను జూపి చరణ కమల మందు నాకు శరణు గొని చోటు యిచ్చి మరణ చక్ర బాధ తీర్చు. || రామా నను || 4. రామ! రామ! రమ్య నామ! రమణి సీత హృదయ సోమ కామితార్ధ వరద! శ్యామ! సుమనోహర శేష ధామ! || రామా నను || రమాకాంతరావు చాకలకొండ Friday, June 22, 2007 Cincinnati OH USA |
#maa telugu talliki mallepU daMDaa# |