Creative works from Telusuna Members

Venkatesa Vededa

Ramakantha Rao Chakalakonda

వేంకటేశ వేడెద , వద్ద నాకు చేరర
సంకట సముద్ర తార, శరణు నాకు నీయర. || వేంకటేశ||

1. కరుణే నీదు కంకణంబు, కమల నయన బ్రోవర,
శరణు గోరు వార మయ్య, సుజన వరద ఏలర. || వేంకటేశ||

2. ఆదరణ ఆభరణా! అభయ మిచ్చి కావర,
నీదరి మా శ్రమలు తీరు, నన్న కావ కదలర. || వేంకటేశ||

3. వరద వేంకటాద్రి వాస, విశ్రాంతి నీయర
వరముగ నీ చరణమందు, విశ్రమింప జేయర. || వేంకటేశ||

4. శ్రీధర శ్రీ వేంకటేశ, శ్రీనివాస శ్రీకర, క్షీర
ఉధది శయన వేగ, కరుణ నాపై జూపర. || వేంకటేశ||

చాకలకొండ రమాకాంతరావు
June 19, 2007 Cincinnati OH USA


#maa telugu talliki mallepU daMDaa#

Back to list