Creative works from Telusuna Members

Kolanulo Yemoolo

Ramakantha Rao Chakalakonda

పల్లవి. కొలనులో ఏమూలో కనులు తెరచిన కలువ
నలువ జనకుని పదము నందిన చాలు. ||కొలనులో||

అనుపల్లవి. విలువ లేని దాని అతి చిన్న బ్రతుకు,
తల్చ తిరుమల కొలువు దక్కిన చాలు. ||కొలనులో||

1. విరులతో దానికి వియ్యమే గాని,
సరి జోడు పోటీలు సుంతము లేవు,
సరస హృదయులు కోరు సొంపులు లేకున్న
హరి చరణమందది యోదిగిన చాలు. ||కొలనులో||

2. భువి మెచ్చు అందాలు బొత్తుగా లేకున్న,
లావణ్యము లేక, లోపాలు ఎన్నున్నా,
తావి , తీపి యందు తెలుపగా లేకున్న.
భువి నాధు పదముల సన్నిధే చాలు, ||కొలనులో||

3. మకరంద మాధురి మచ్చుకు లేకున్న,
ఆకళించ అది ఎవరికి కాకున్న,
అకళంకుడు హరి అచ్యుతుని సేవలో
సకలము అర్పించ, సంతృప్తి చాలు. ||కొలనులో||


రమాకాంతరావు చాకలకొండ
Monday, June 25, 2007 Cincinnati OH USA



#maa telugu talliki mallepU daMDaa#

Back to list