Creative works from Telusuna Members

అన్నీ నీవే - తత్వము సత్త్వము

Ramakantha Rao Chakalakonda

తత్వము నీవే వేంకటేశ! నా జవ
సత్త్వము నీవే శ్రీనివాస! ||తత్వము||

1. మదిలోన మరులొలుకు మాధుర్యము నీవే,
సుధ లొలుకు భావనల సారము నీవే,
ఎద కోవెలందు కన ఏకోనలో నైన,
నాదైవమా! నన్ను ఏలేది నీవే! ||తత్వము||

2. కల్పనలో కవితలా కులికేది నీవే,
వలపుల తెమ్మెరై ఉరికేది నీవే,
తలపులో మెరుపులా, తన్మయత్వములోన,
పల్లవిగ, చరణముగ ప్రభవింతువు నీవే! ||తత్వము||

3. కురిసేటి వానలో, మెరిసేటి మబ్బులో
పరుగెట్టు గాలిలో, పరవళ్ళ గంగలో
మరు మల్లె జల్లులో, మదిలోన కవితవై
తిరువేంకటాధీశ! తెమలెదవు నీవే! ||తత్వము||

చాకలకొండ రమాకాంతరావు
Tuesday, June 26, 2007 Cincinnati OH USA


#maa telugu talliki mallepU daMDaa#

Back to list