పూజించు యీ పదమే పరమ పద దాయకము, నిజమెరిగిన యిదే నిత్య వైభోగము. ||పూజించు|| 1. తేజము తానైన – రవి శశికి ప్రభలొసగి, బీజమై – బ్రహ్మకు సృజన శక్తిని యొసగి, ద్విజులు, దేవతలచే – పూజ లందెడివాడు, అజుడే అంతర్యామి అతడే మన రక్ష! ||పూజించు|| 2. దివిన త్రైమూర్తులగ దేవతలు కొల్చిన, భువిన బహురూపులలో భక్తులు కొలచిన, భువన భాండములకు మూలము తానైన, దివిజేంద్ర వంద్యుడు దేవ దేవుడు ఒకడే! ||పూజించు|| 3. గ్రహములకు గురుడై గతులను చూపించి, మోహ మాయలో ముంచి, మనుగడ కల్పించి, నిర్వహించి జగము నేర్పుగా నడిపించు, విహంగ వాహనుడు వేంకటేశుడు విభుడు. ||పూజించు|| చాకలకొండ రమాకాంతరావు Wednesday, June 27, 2007 Cincinnati OH USA |
#maa telugu talliki mallepU daMDaa# |