Creative works from Telusuna Members

అంతర్యామి - తనువులు శాశ్వితమా

Ramakantha Rao Chakalakonda

తనువులు శాశ్వితమా! తమకములు శాశ్వితమా!
తాను, తన యను కొనే తపనలు శాశ్వితమా! ||తనువులు||

1. నశ్వరము యీ జగము, నశ్వరము దేహము
నశ్వరము నమ్ముకొన్న యీ మోహ బంధము,
నశ్వరము మన శక్తి, నిగ్గు ఐశ్వర్యము,
విశ్వమున యోచించ ఏది శాశ్వితమా! ||తనువులు||

2. పదవులు, బిరుదులు, పదిమందిలో కీర్తి,
ఎదిగిన అస్ధులు, ఎన్నేన్నో సంపదలు,
ముదిరిన వయసులో మన్ను పాలేగాని
ఏది యోచించిన యిచట శాశ్వితము ? ||తనువులు||

3. వంచనలు, వేదనలు, వలపులు, విరహాలు, యో
చించ జగతిన ఏది శాశ్వితము ?
ఎంచ తిరుమల పతి ఏడు కొండల స్వామి,
పంచన ఉన్నదే గాదే పటువుగ శాశ్వితము. ||తనువులు||

చాకలకొండ రమాకాంతరావు
Thursday, June 28, 2007 Cincinnati OH USA


#maa telugu talliki mallepU daMDaa#

Back to list