Creative works from Telusuna Members

నిక్కము జగము నాటక రంగమే,

రమాకాంతరావు చాకలకొండ

నిక్కము జగము నాటక రంగమే,
అక్కర కొరకే అందరి వేషము. ||నిక్కము||

1. చిక్కగానే అవకాశము చేడెపై
అక్కట చేతురే అకృత్యములు,
ఎక్కడ కేగిన ఎందరి జూచిన,
చక్కటి పురుషులు చూడగ అరుదే! ||నిక్కము||

2. ఒక్కడు మిత్రుడై వద్దన చేరి
పక్కన చల్లగ బల్లెము గుచ్చి
దక్కిన దానిని కొల్ల గొట్టును
ఎక్కడ న్యాయము యిలపై నేడు. ||నిక్కము||

3. తక్కెటలోన సరిగ జూచిన
ఎక్కడ మిత్రులు, బంధు గణములు
మ్రొక్కిన చక్కగ పక్కన నిల్చెడి
ఒక్కడు వాడే వేంకట నాధుడు. ||నిక్కము||



రమాకాంతరావు చాకలకొండ
June 29, 2007 Cincinnati OH USA



#maa telugu talliki mallepU daMDaa#

Back to list