Creative works from Telusuna Members

తనువులో తాపము తీర్చవే తెమ్మెర

రమాకాంతరావు చాకలకొండ

తనువులో తాపము తీర్చవే తెమ్మెర,
అణువణువు అర్పించి అంది నాకు చల్లగ. || తనువులో||

1. హృదయాన్ని పెనవేసి హత్తుకోవే మెల్లగ,
మదినంత పెనవేసి మమత జూపు మెల్లగ,
ఎదలోన కల్గించు వలపు బాధ వెచ్చగ,
ఆదరించి నా ప్రాణం అలరించవే వలపుగ. ||తనువులో||

2. అలల పైన కులకవే వయ్యారి చల్లగ,
చిలిపిగ చరియించు చేనుపైన వంపుగ, పూ
వులను ముద్దాడు ప్రేమగ మృదువుగ,
అల్ల నల్లన ఆడి అందవే నా ఊహగ. ||తనువులో||

3. కల్పనలో కవితగ కదలిరావే మెల్లగ,
అల్పము చేయు బాధ అమృత జల్లుగ,
కల్పతరువు వేంకటపతి కమ్మని తలపుగ
తెల్పవే తత్వము తామసము వీడగ. ||తనువులో||

రమాకాంతరావు చాకలకొండ
June 24, 2007 Cincinnati OH USA


#maa telugu talliki mallepU daMDaa#

Back to list