చేరెదను ఎన్నడో నీ కొండకు, హరి నీదు శరణమున యీ జన్మకు. ||చేరెదను|| 1. పాప పంకిలమందు పడి, లేచి, ముణుగుచు, తాపములు, కోపముల తామసములో చిక్కి, రాపిడుల రగడలో రగులు కొని వేసారు, శాపగ్రస్తుడ నేను శేషాద్రి వాసా! ||చేరెదను|| 2. జప, తపంబులు యేవి చేయని వాడను ఒప్పగా ఒకనాడూ పూజ చేయని వాడ, గొప్ప గుడిలో నొప్పు గోవింద నాయకుడ ఎప్పటికి నిను చేరి సేవింప గలనో. ||చేరెదను|| 3. చపల చిత్తుడ నేను, స్థిరమంటూ ఎఱుగను, నేర్పుగ ఒక విద్యా నేర్వని వాడను, సర్ప తల్ప శాయి శ్రీ శ్రీనివాసుడా! తప్పులన్నీ కాచి దయను జూపయ్యా! ||చేరెదను|| చాకలకొండ రమాకాంతరావు June 20, 2007 Cincinnati, OH USA |
#maa telugu talliki mallepU daMDaa# |