Creative works from Telusuna Members

బంధములు - అనుబంధములు

చాకలకొండ రమాకాంతరావు


బంధములు - అనుబంధములు,
డెందమును హరి పదముకు గట్టెడి
సుందరమైన సూక్ష్మములు. ||బంధములు||

1. మందారముల మాలిక మాదిరి
అందములై, అమరత్వము తెలిపి,
ఇందిర నాధుని చెంతన చేర్చెడి,
కందువ కమ్మని కల్పనలు. ||బంధములు||

2. మదిలో తియ్యని మమతగ చేరి
ఎదలో చల్లని భావ కుసుమమై,
పదిలముగ హరి పదమును చేర్చెడి
మాధవ శ్యాముని మంత్రములు. ||బంధములు||

3. భవ బంధముల బాధలు తీర్చి
శివ మంత్రములై సూక్ష్మము తెల్పి
నవ విధి భక్తుల నాణ్యత నేర్పెడి
కువలజ నాధుని కీర్తనలు. ||బంధములు||

4. నరులకు సులువుగ దగ్గర చేరి
తిరు మంత్రములై త్రోవను జూపి
శరణము నిచ్చి శుభములు గూర్చే
తిరుమలవాసుని నామములు. ||బంధములు||

చాకలకొండ రమాకాంతరావు
June 18, 2007 Cincinnati OH USA


#maa telugu talliki mallepU daMDaa#

Back to list