Creative works from Telusuna Members

శోధించిన - ఎంత సాధించిన

రమాకాంతరావు చాకలకొండ


శోధించిన - ఎంత సాధించిన,
ఏది యీ జగమున నీకు శాశ్వితము. ||శోధించిన||

1. తామసము తెగ నరకి, శ్యామ సుందరు నెఱిగి,
కామ, క్రోధములనే కలుషములు తృంచి,
రామ పాద సేవారతుడైన జీవుని,
నామమే గాదా భువిన శాశ్వితము! ||శోధించిన||

2. సోమరస దాసుడై, కామ పీడితుడై,
కామిని కృపలకై ప్రాకులాడెడి జన్మ,
ఏమని తెల్పెదను ఎన్ని సంపదలున్న,
భూమిన నామము మిగుల శాశ్వితము? ||శోధించిన||

3. సొమ్ములు, డబ్బులు, సొగసైన మేడలు,
నెమ్మిగ మిత్రులు, నెలత, బంధువులున్న,
వమ్ము గాదే జన్మ విష్ణుసేవలు లేక,
నమ్ముకొన్నవి వీడ ఏది శాశ్వితము? ||శోధించిన||

రమాకాంతరావు చాకలకొండ
June 13, 2007 Cincinnati OH USA#maa telugu talliki mallepU daMDaa#

Back to list