సకలము నీవైన శ్రీ వేంకటేశ్వర, నీకటాక్షము జూపి కోర్కె సిద్ధించర. ||సకలము|| 1. శ్రీరామ! సేవలో సఫలము చెందుటకు, నరసేవలో జన్మ నాణ్యత నొందుటకు, సిరి సంపదల నిచ్చి, శక్తి సమకూర్చర, హరి! నీదు సేవకే అంకితము అగుదుర. ||సకలము|| 2. మదిలోని ఆశలు మాలికలు యగుటకు, ఎదలోన సంతృప్తి ఇంపుగ నిండుటకు, శ్రేదేవి కృపనొసగి సాయము చేయర, ఆది నారాయణ ఆశలను తీర్చర. ||సకలము|| 3. కరుణాకర ఆశ - క్రియగ మారుటకు, కార్య సాధన చేసి కన్ను మూయుటకు, కనక వర్షము కురిపి కలిమిని గూర్చర, తిరువేంకటారమణ తరుణము జూపర. ||సకలము|| రమాకాంతరావు చాకలకొండ June 13, 2007 Cincinnati OH USA |
#maa telugu talliki mallepU daMDaa# |