రామ రామా యనరే, కోదండ రామనరే, రాముని సేవలో సంతృప్తి గనరే! ||రామ రామా|| 1. తారక మంత్రములో తీపిని కనరే, మన సార హరి కీర్తి ముదముగ పల్కరే, చరణ సేవలో యున్న సంతృప్తి గనరే, కరుణాకరుని కొల్చి కమ్మగ మనరే! ||రామ రామా|| 2. భవ బాధలు తొలుగ భక్తి చేకొనరే శివ నామము పల్కి శ్రేయములు గొనరే, నవ విధి సేవల నాణ్యము గనరే దేవ దేవుని తల్చి దరిని దరి కనరే. ||రామ రామా|| 3. రాముడే శ్యాముడు, గోపాల దేవుడు, తి రుమల రాముడు తత్వము యతడే, తామసము వైదొలగ తపములు చేయకే నామ జపము చేసి నిర్ముక్తి గనరే. ||రామ రామా|| రమాకాంతరావు చాకలకొండ June 13, 2007 Cincinnati OH USA |
#maa telugu talliki mallepU daMDaa# |