అలమేలు మంగమ్మ అగు పించవే! కలతలు తొలగించి కడతేర్చవవే! ||అలమేలు|| 1. కలువు రేకుల కనులు - కమ్మగ విప్పార నలువ జనని నన్ను కరుణించవే, చలువ కన్నులతోటి చక్కగ నను జూచి అలమిన కష్టములు తొలగించవే! ||అలమేలు|| 2. కను సన్నల హరిని కొంగున గట్టేసి, జనులును కాపాడు జగదేక మాత, అనువుగ నీ యండ అందగ మా యమ్మ, చనువుగ పిల్చెదను చక్కని తల్లీ! 3. కోదండ రామునే కట్టేసు కొంటివి పూదండగ హరి మెడను చేరితివి, ఉద్దండుడు హరి అండదండగ నుండ కైదండ నీయవే కమ్మని తల్లీ! రమాకాంతరావు చాకలకొండ June 10, 2007 Cincinnati OH USA |
#maa telugu talliki mallepU daMDaa# |