Creative works from Telusuna Members

బ్రహ్మాండంబులే బంతులు పెట్టెడి

రమాకాంతరావు చాకలకొండ

పల్లవి. బ్రహ్మాండంబులే బంతులు పెట్టెడి
బ్రహ్మ జనకుడే భుజంగ శయనుడు.
అనుపల్లవి. నిండు మనసుతో నుతులను చేసిన
అండగ నుండెడి అమృత హృదయుడు. || బ్రహ్మాండంబులే||

1. భారత దేశపు భాగ్య విధాత
నీరజ నాభుడు నిఖిలేశ్వరుడు
భూరి జగముల బ్రహ్మాండములో
తిరుమల రాయుడే తత్వము, దేముడు. ||బ్రహ్మాండంబులే||

2. గిరిజ మాత కృపలను జూపగ
సిరి జనని నా శరణము కాగ
శారద మాత చక్కగ తెల్పగ
ధరణిన యీతడే దేవ దేవుడు. || బ్రహ్మాండంబులే||

3. కరుణే వీనికి కంఠ మాలగ,
సరసత వీనికి సొంపగు కీర్తిగ
తిరుమలలో మన ఆంధ్రావనిలో
శరణము నీయగ విరసిన వాడు. || బ్రహ్మాండంబులే||

రమాకాంతరావు చాకలకొండ
June 9, 2007 Cincinnati OH USA


#maa telugu talliki mallepU daMDaa#

Back to list