Creative works from Telusuna Members

నారాయణం భజే, నీరజ నాభం

రమాకాంతరావు చాకలకొండ

నారాయణం భజే, నీరజ నాభం
నారద సన్నుతం, నాదప్రియం. || నారాయణం||

1. దేవ దేవం భజే, ధారుణీ పోషకం
దేవేంద్ర వందితం, దివ్య స్వరూపం,
భవ పాప నాశకం, భక్త సంరక్షకం,
కువలయ నయనం, కరి రాజ వరదం. || నారాయణం||

2. దనుజాంతకం భజే, దశరధ రామం
జన్మ పాశ నాశం, జగ జీవ కందం,
జానకి వల్లభం, ఙ్ఞాని హృద్గమ్యం, పవ
మాన సుత నుతం, పరమపద వరదం. || నారాయణం||

3. వేంకటేశం భజే, విష్ణు స్వరూపం,
సంకట నాశకం, శబరి ప్రియం, భవ
పంక దూరం, పరమ దయాళం,
పంకజాక్షం, హరే! ప్రహ్లాద వరదం. || నారాయణం||

రమాకాంతరావు చాకలకొండ
June 8, 2007 Cincinnati OH USA


#maa telugu talliki mallepU daMDaa#

Back to list