Creative works from Telusuna Members

సమతాభావమే సర్వ మంగళము

రమాకాంతరావు చాకలకొండ

సమతాభావమే సర్వ మంగళము,
సమవర్తనయే సర్వ సమ్మతము. ||సమతాభావమే||

1. జీవులు అందరూ - దేవుని రూపులే,
హావ, భావములు - అందరినొకటే,
రవ్వంత యిది పరిగ్రహించిన
దివ్య సూత్రమిది తీర్చను దుఃఖము. ||సమతాభావమే||

2. దేహ బాధలు, ఆకలి దప్పులు
మోహ, తాపములు ప్రాణుల కొకటే,
ఆహము వీడి యిది ఆలోచించిన,
సహన శీలతే శుభదాయకము. ||సమతాభావమే||

3. హరి రూపులే యీ దేహ ధారులు
శరీర బేధమే, సర్వము ఒకటే,
మర్మ మెరిగి మది నిమ్మళించిన,
తిరుమల తత్వమీ దివ్య యోగమే. ||సమతాభావమే||

రమాకాంతరావు చాకలకొండ
June 7, 2007 Cincinnati OH USA


#maa telugu talliki mallepU daMDaa#

Back to list