ఎంత చదువులు యున్న, వింతగా జగతిన ఇంగిత ఙ్ఞానము, ఎందుకో కొదువ ? || ఎంత|| 1. చిలకలా పలికెదరు శ్లోకములు, భాష్యములు వల్లె వేసెదరెన్నో వేద మంత్రములు, చల్లగ తెలిపెదరు చక్కగ గీతను, తెల్ల గాదు ఎలో తామస భావములు. || ఎంత|| 2. విష్ణు నామములను వల్లె వేసెదరు, మది లోన తృష్ణకు మాటు వేయరు ఎలో ? కృష్ణుని పదములు కడిగెదరు నిత్యము, ని కృష్ట మలినము కడుగరు ఎలో? || ఎంత|| 3. పంతములకు పోయి పరులను దూసెదరు, సొంతమగు దోషములు సరి చేసుకొనరు, చెంత ఉన్న సప్త - చలపతిని మది తలచి, సుంతమైన ఎదను సాధించలేరు ? || ఎంత|| చాకలకొండ రమాకాంతరావు June 6, 2007 Cincinnati OH USA |
#maa telugu talliki mallepU daMDaa# |