సుందరుడు శ్రీకరుడు శ్రీపతే రక్ష అందాల రాముడు అనిశము రక్ష. ||సుందరుడు|| 1. నీల ఘన శ్యాముడు నింగిన మారక్ష, జలములోన గంగ - జనకుడే రక్ష, నీళాపతే మాకు నేలపై సంరక్ష, అలమేలు మంగపతి అంతట రక్ష. ||సుందరుడు|| 2. అనిలములో అత్మకు అచ్యుతుడు రక్ష, అనలములో అందించు అది దేవుడు రక్ష, అన్నమయ్య ప్రియడు అన్నివేళల రక్ష, అ వనిజ పతి మా అత్మ సంరక్ష. ||సుందరుడు|| 3. జగదభి రాముడు జగమంత రక్ష ఖగ వాహనుడు మాకు కల్గించు రక్ష, నగ ధరుడు శ్రీహరి నిత్యము మారక్ష, వగ జూపు వేంకడే వెనుబలము, రక్ష. ||సుందరుడు|| రమాకాంతరావు చాకలకొండ June 5, 2007 Cincinnati OH USA |
#maa telugu talliki mallepU daMDaa# |