Creative works from Telusuna Members

కోరి నీ పదములు కొల్వగ వచ్చితి

రమాకాంతరావు చాకలకొండ

కోరి నీ పదములు కొల్వగ వచ్చితి
కోర్కెలు తీరగ కొలువులు చేసితి. ||కోరి నీపదములు||

1. మది కమలము నీకు అర్పణ చేసితి,
ఎద కోవెలందు నీ రూపము నుంచితి,
పద్దతిగ నిత్యము ప్రార్ధనలు చేసితి,
సాధన చేయుటలో శ్రద్ధను జూపితి. ||కోరి నీపదములు||

2. నాద యుతముగ నీ - నుతులను చేసితి,
వేద మంత్రములతో వినతులు చేసితి,
మోదముగ ఎన్నెన్నో మ్రొక్కులు మ్రొక్కితి,
వేదనలు విడచి నీ వద్ద నే చేరితి. ||కోరి నీపదములు||

3. రాధా ప్రియ! నిన్ను రమ్మని పిలచితి, ఆ
రాధన చేసి అర్చనలు సలిపితి,
వేద నుత శ్రీకర శ్రీ వేంకటేశ్వర, భవ
బాధ హర! నీదు దాస్యము చేసితి. ||కోరి నీపదములు||

రమాకాంతరావు చాకలకొండ
June 4, 2007 Cincinnati OH USA


#maa telugu talliki mallepU daMDaa#

Back to list