Creative works from Telusuna Members

కాసు కాసు కూడి కానేరదా నిధి

చాకలకొండ రమాకాంతరావు


పల్లవి. కాసు కాసు కూడి కానేరదా నిధి,
ఆశయ సిద్ధికి అదిగాదే పద్ధతి. ||కాసు కాసు||

అనుపల్లవి. అభ్యాసము చేయ అన్ని యగు సాధ్యము
ఆత్మ విశ్వాశమే అందుకు ముఖ్యము. ||కాసు కాసు||

1. పలుకగ పలుకగ పలుకే పాటగ మారు
కులుకగ కులుకగ కులుకే నాట్యము యగు,
తల్చగ తల్చగ తలపే తియ్యగ మారు
అల్పమే అధికమై అతిశయము నొందు. ||కాసు కాసు||

2. దాసుడిగ భువిలోన జన్మ నొందిన గాని,
ఆశయము సాధించ అవకాశము రాదు,
పాశముల తృంచుకొని పరమాత్మ సన్నిధిలో
దాశ్యము చేయక దివ్యత్వము రాదు. ||కాసు కాసు||

3. మనసు మాధవుని పై నిలిపిన గాని
కనగ కైవల్యము కైవశము గాదు,
ఎనలేని కృపలున్న వేంకని తల్చక,
జన్మ యీ జగమున సఫలము గాదు. ||కాసు కాసు||

చాకలకొండ రమాకాంతరావు
June 3, 2007 Cincinnati OH USA


#maa telugu talliki mallepU daMDaa#

Back to list