Creative works from Telusuna Members

తప్పటడుగులు యైన, తప్పు అడుగులు యైన

రమాకాంతరావు చాకలకొండ

తప్పటడుగులు యైన, తప్పు అడుగులు యైన,
తప్పు దిద్దుకొన్న, అప్పడికి ప్రియము. || తప్పటడుగులు||

1. తప్పు చేయని వారు లోకమున శూన్యము
తప్పు తెల్సు కొనుటే అతి ధీర గుణము,
తప్పులను దాచు కొని తప్పు చేయు వారు,
తప్పక గందుము – యీ లోక మందు. || తప్పటడుగులు||

2. తప్పులనే ఒప్పులుగ భావించు వారలు,
తప్పని తెల్సిన తప్పు చేయు వారు,
తప్పు తప్పుగ నెంచి తగు రీతి తగ్గించు
గొప్పగు మనసుగల గుణవంతులు గలరు. || తప్పటడుగులు||

3. తప్పు సరి దిద్దుకొను తగు రీతి మార్గము
గొప్పదగు సహనము, ఆత్మ విశ్లేషణము,
నొప్పక నొవ్వక తప్పించు కొనువాడే
అప్పడి దృష్టిలో అత్యంత ఘనుడు. || తప్పటడుగులు||

రమాకాంతరావు చాకలకొండ
May 25, 2007 Cincinnati OH USA


#maa telugu talliki mallepU daMDaa#

Back to list