Creative works from Telusuna Members

హరి కీర్తనే మాకు ఆహారము

రమాకాంతరావు చాకలకొండ


హరి కీర్తనే మాకు ఆహారము,
హరి తత్వమే మా ఆధారము. || హరి కీర్తనే ||

1. హరి భావనే తల్చ మా నైజము
హరి సేవనే బ్రతుకు అచారము,
హరి చింతనే మది సహజత్వము
హరి పూజలే చేయు శుభ కార్యము. || హరి కీర్తనే ||

2. హరి నెఱుగుటే మా అభ్యాసము,
హరి ధ్యానమే మా నైపుణ్యము,
హరి చరిత పఠనలే మా శాస్త్రము,
హరికి అంకితము యీ జన్మము. || హరి కీర్తనే ||

3. హరికి నామ కీర్తనే మా లక్ష్యము,
హరి హరి యనుటే ఆంతర్యము,
హరి దాసుడై మనుటే మా గమ్యము,
హరి వేంకటేశుడే మా దైవము. || హరి కీర్తనే ||

రమాకాంతరావు చాకలకొండ
May 27, 2007 Cincinnati OH USA



#maa telugu talliki mallepU daMDaa#

Back to list