Creative works from Telusuna Members

నారు పోసిన జీవుడే, నీరు పోసి పెంచడ?

రమాకాంతరావు చాకలకొండ

నారు పోసిన జీవుడే, నీరు పోసి పెంచడ?
కరుణ నిండిన దేముడే, కన్నీటి వేళ బ్రోవడ? ||నారు పోసిన||

1. అండ దండగ వాడు ఉండగ, ఎండ యైన వాన యైన,
నిండు పున్నమి రేయిలాగ, పండు వెన్నెల నిండద? ||నారు పోసిన||

2. కన్న వారే దూరమై, కన్నీరు గుండెన నిండగ,
వెన్న వంటి గుండె ఉన్న, వేంకటేశుడే బ్రోవడా? ||నారు పోసిన||

3. కారు మేఘమై యీతి బాధలు, కమ్మి అలజడి చేయగ,
ధారుణి పతి దివ్య రూపుడు, దయతో ఏలి బ్రోవడా? ||నారు పోసిన||

4. చేతు లెత్తి మ్రోక్కగ, ఆ చలపతి దరి చేరడ?
మోతగ నా మదిన నిండిన, వేదన దయ తీర్చడా? ||నారు పోసిన||

5. బ్రతుకు బరువై -గుండె చెరువై, బాసటేమి లేని నాడు, వె
లుతురై ఆ వేంకటేసుడే, బ్రతుకు దారి చూపడా? ||నారు పోసిన||


రమాకాంతరావు చాకలకొండ
June 22, 2007 Cincinnati, OH USA


#maa telugu talliki mallepU daMDaa#

Back to list