Creative works from Telusuna Members

శేషాద్రిపై నడిగో శ్రీకాంతుడు

చాకలకొండ రమాకాంతరావు

శేషాద్రిపై నడిగో శ్రీకాంతుడు,
భూషణోపేతుడు భూకాంతుడు. ||శేషాద్రిపై||

1. వజ్ర కిరీటపు వెలుగులు ఉప్పొంగ,
భుజ కీర్తుల భూరి దీప్తులు పొసగంగ,
నిజ వైభవ భూరి నిండారు శోభలతో,
గజ రక్షకుడు యడుగో గోవిందుడు. ||శేషాద్రిపై||

2. అలమేలు మంగమ్మ ఆగుండెపై వెలుగ,
కలికి సిరి యీ వైపు కాంతులతో మెరయంగ,
తెలుగు వారి యింట దీపమై నెలకొన్న,
కుల దైవము అడుగో కలి వేంకటేశుడు. ||శేషాద్రిపై||

3. మణిమయ దీప్తుల మాల మెడ ఒనరంగ
ఫణి శయనుడు అడుగో ప్రభలేన్నో చిమ్మగ,
కనక మయ భూషణుడు, కామితార్ధ దాయి
కనుగొన అల్లడిగో కన్నల పండువగ. ||శేషాద్రిపై||

చాకలకొండ రమాకాంతరావు
June 21 2oo7, Cincinnati OH USA


#maa telugu talliki mallepU daMDaa#

Back to list