Creative works from Telusuna Members

యిది హృదయ రోగాలు తొలగించు వైద్యము

చాకలకొండ రమాకాంతరావు

యిది హృదయ రోగాలు తొలగించు వైద్యము,
యిది మది మలినాలు కడుగు ఔషధము. ||యిది||

1. యిది భవ సాగరము దాటించు యంత్రము,
యిది వేద మంత్రముల యింపైన సారము,
యిది గీత బోధించు గూఢమగు మార్గము,
యిది తెల్సిన బ్రతుకు - బాటగు సుగమము. ||యిది||

2. యిది పర సాధనకు పావన మంత్రము,
యిది ఇహ సౌఖ్యములు అందించు తంత్రము,
యిది మునులు సాధించు ఎకైక గమ్యము,
యిది సత్యము, సుఖము, సతత నిర్మలము. ||యిది||

3. యిది సర్వ జీవుల ఎకైక మూలము,
యిది తొలుత నిండిన ఓంకార నాదము,
యిదే అది, అంతము, అనంతము, శూన్యము,
యిది విశ్వ గోళముకు భ్రమణ ఆధారము. ||యిది||

4. యిది ప్రేమ సాకర సుందర రూపము,
యిది కొల్చు భక్తులకు కొంగు బంగారము,
యిది మధుర అమృత, మకరంద తుల్యము
యిది వేంకటాపతి మధురమగు నామము. ||యిది||

చాకలకొండ రమాకాంతరావు
May 20, 2007 Cincinnati OH USA


#maa telugu talliki mallepU daMDaa#

Back to list