Creative works from Telusuna Members

సాధింపరే ఘనులు సామర్ధ్యము పెంచి

రమాకాంతరావు చాకలకొండ

సాధింపరే ఘనులు సామర్ధ్యము పెంచి,ధ
ర్మార్ధ కామములు ధరణిలో నెంచి. ||సాధింపరే||

1. కామ, క్రోధములను కొన వరకు త్రుంచి,
ప్రేమయను దివ్వెను పట్టి వెలిగించి,
శమ, దమాదులతోటి శాంతి స్థాపించి,స్వ
ర్గముగ భువిలోనే సమత స్థాపించి. ||సాధింపరే||

2. కర్తవ్య సాధనే క్రియలోన పెంచి,
భార్తు భావమే భువిన బాగ సాధించి,
ఆర్ధము, ఙ్ఞానము అందరికి పంచి, ని
స్వార్ధ భావనే జగతిలో పెంచి. ||సాధింపరే||

3. కమ్మని ప్రేమనే కలయ సాధించి,
నెమ్మిగ నెయ్యము అందరికి పంచి,
యిమ్ముగ జన్మము యిలన సాధించి
కొమ్మ మంగ పతి మెచ్చు భక్తుడిగ. ||సాధింపరే||

రమాకాంతరావు చాకలకొండ
May 18 2007 Cincinnati OH USA


#maa telugu talliki mallepU daMDaa#

Back to list