రామ రామని – మధుర నామము పల్కని తామస హృదయులకు దారి ఏది ? కామ క్రోధములనే కలుషములు నిండిన పామరుని బ్రతుకుకు పటిమ ఏది ? ||రామ రామని|| 1. పురుషోత్తముని మదిలో పూజింప జాలని పాపిష్టి పుటకకు అర్ధ మేది ? సిరి నాధుని మదిలో సేవింప జాలని శాపగ్రసుని కిక శాంతి ఏది ? ||రామ రామని|| 2. రామ నామము యందు రంజిప జాలని రోగిష్టి రాతకు రమ్య తేది ? సీ తమ్మ పతి పదము సొంపుగ పట్టని సోమరి కరముకు సొబగు ఏది? ||రామ రామని|| 3. హరి కీర్తి చేసెడి గళము నొక్కగ నెంచు నరుడు, నాస్తికునికి బేధమేది ? తిరమలేశుని పాట తేనియగ నెంచని తామసికి తరియింప తావు ఏది ? ||రామ రామని|| రమాకాంతరావు చాకలకొండ May 17, 2007 Cincinnati OH USA |
#maa telugu talliki mallepU daMDaa# |