Creative works from Telusuna Members

బాసర సరస్వతి ప్రార్ధన

రమాకాంతరావు చాకలకొండ

ఆసరా యిచ్చే బాసర తల్లీ
ఆశలు తీర్చవే అమృత వల్లీ!
వాసిగా నీపద దాసుల ఎదలో
వాసము ఉండెడి వెన్నెల వెల్లీ! ఆసరా
1. వేదములే నీ వీణపై పలుక
మధుర నాదముల గానములొలుక
మోదముతో మా ఎదలే కులుక
ఆదరించవే అమృత వల్లీ! ఆసరా
2. సరిగమలే నీ సొంపులు కాగ
స్వరజతులే నీ పదగతి కాగ
అరువది నాలుగు కళాకేళిగ
నిరతము మమ్ము బ్రోవవే తల్లీ! ఆసరా
3. దవళ వస్త్రముల దీప్తులు మెరయగ
నవ్వుల జల్లుల వెన్నెల కురియగ
పువ్వుల వానలు నీ పలుకులుగ
కవితలే సొంపులై కులుకెడి తల్లీ! ఆసరా
4. వినయ విధేయతా వన్నెల పూలతో
మన్నన చేసి మొక్కెద నిన్నే
కన్నులలోన కరుణను నింపి
నన్నిక బ్రోవుము నిరతము తల్లీ! ఆసరా
5. చక్కటి చదువుల సంపదలిచ్చి
వాక్కులలోన వన్నెలు కూర్చి
పెక్కు విద్యల ప్రసాదమిచ్చి
మొక్కులు తీర్పవే మమతల వల్లీ! ఆసరా
రమాకాంతరావుచాకలకొండ
Cincinnati OH USA


#maa telugu talliki mallepU daMDaa#

Back to list