Creative works from Telusuna Members

ఆంధ్రమాత కన్న బిడ్డలం

చాకలకొండ రమాకాంతరావు

రాగం: హంసధ్వని
సంగీతం: శ్రీమతి ఇందిరామణి
రచన: చాకలకొండ రమాకాంతరావు

పల్లవి. ఆంధ్రమాత కన్న బిడ్డలం,
అందరిలో మేము మిన్నలం
అనుపల్లవి. పొందికగా అందరం పాలు నీరు లా కల్సి
ముందు కొకటై సాగి పోదము. ||ఆంధ్రమాత||

1. తర తరాల సంప్రదాయ సోయగాలే ఆస్ధులుగ
తరగని మా మూల ధనం తెలుగు జాతి సంస్కృతిగా
వీర నారి, నవ యువకులు వెల్లువగ వేగంగా
వార సత్వ పౌరుషమే వరలొలుకగ తరలుదాం. ||ఆంధ్రమాత||

2. టంగుటూరి కేసరులకు, సీతారామ రాజులకు
నింగి నంటు కీర్తి గల కందుకూరి,గురజాడకు
పొంగి పోవు త్యాగ బుద్ధి విశ్వదాత కాశీలకు,
పొంగారు కన్న తల్లి పుణ్యభూమి యిది అందాం. ||ఆంధ్రమాత||

3. కాయ కష్టం చేయుచూ పొలాలను పండిద్దాం,
హేయమైన పనులేవి లేవన్నది చాటిద్దాం,
చేయి చేయి కలుపు కొని చెలిమి తోటి జీవిద్దాం,
హాయిలోన ఆంధ్రావని కన్న మిన్న లేదందాం. ||ఆంధ్రమాత||

చాకలకొండ రమాకాంతరావు Cincinnati, OH USA
Thursday, November 16, 2006


#maa telugu talliki mallepU daMDaa#

Back to list