Creative works from Telusuna Members

తేటగీతులు వ్రాయు తెలివి లేదు మాకు

రమాకాంతరావు చాకలకొండ

మిత్రులార! మనం ఎన్ని సాధించిన, ఏ పదవిలో ఉన్నా, నమ్రతా భావమే వన్నె తెస్తుంది. దానికి శ్రీ రామచంద్రుడే ఉదాహరణ. మనం ఎన్నెన్నో సాధిస్తాం, ఉన్నత పదవులు అలంకరిస్తాం. కాని అహంభావంతో అసలు మరచి పోతాము. యివ్వన్నీ మన కిచ్చిన ఈశ్వరునే మరుస్తాం. నేను ప్రొఫెసర్ని, నేను విద్యావేత్తను, నేను యిది, అది అని విఱ్ఱవీగుతాం. కాని అసలు నిజం యివ్వని ఆయన యిస్తూ ఆడిస్తున్న నాటకం.

దీనికి స్వామి సత్య సాయి బాబా వారు చక్కని ఉదాహరణ యిచ్చారు. ఒక చిన్న పిల్లవాడు తండ్రి ఒడిలో కారు డ్రైవరు సీటులో కూర్చొని, స్టీరింగ్ పట్టుకొని, నడుస్తున్న కారు చూచి, తనే నడుపుతున్నానని అనుకొని ఆనందిస్తాడు. వెనకు పిల్లవాడిని ఒడిలో కూర్చోబెట్టుకొని నడుపుతున్న తండ్రి పిల్లవాడి ఆనందం జూచి నవ్వుకొంటూ నడుపుతాడు. మనము ఆ పిల్లవాడితో సమానం. యీ సత్యం తెలుసకొంటే మన నూన్యత ఏమిటో మనకే అర్దం అవుతుంది. భగవంతుడు మన జీవితమనే యీ కారు నడుపుతున్నంత వరకు మనకు ఏ భయం లేదు, ఆ సంగతి తెల్సు జీవత యాత్ర సాగిస్తున్న మనకు ఏ కొదువ రాదు.

పల్లవి. తేటగీతులు వ్రాయు తెలివి లేదు మాకు
అటవెలదులు యన్న అచ్చిరాదు మాకు.

అనుపల్లవి. నీతిగ శ్రీహరిని నమ్మి బ్రతుకుటే గాని
చేతగాదు మాకు చెప్ప ఏ నీతులు. ||తేటగీతులు||

1. హరి భక్తి హృదయమున వెల్లువై పొంగగ
శారదాంబ కృపలు చల్లగ కురయగ,
నారదాదులు మదిన నాదములు నేర్పగ,
గిరి సుతుడు గణపతి వ్రాయు గీతలే గాని. ||తేటగీతులు||

2. రతి నాధ జనకుడే యతులను కూర్చగ,
శృతి కల్ప లయ కొరకు ప్రాసలను యివ్వగ,భా
రతి అతి దయతో భాష సమకూర్చగ,
చేతి కందిన ఫలమే - చేయలేను రచన. ||తేటగీతులు||

3. సిరనాధుడు మాకై చరణముల అల్లగ,
తిరుమలేశుని దయలు తెలుగుగా మారగ,
మరుని గన్న తండ్రి మాధుర్య మీయగ, జాలు
వారిన కవితే - కాదు మా ఘనత. ||తేటగీతులు||

రమాకాంతరావు చాకలకొండ
May 28 2007 Cincinnati OH USA


#maa telugu talliki mallepU daMDaa#

Back to list