పల్లవి. మేలుకొనుము మేలుకొనుము మగత నిద్ర సోదర! మేలుకొని తేరుకొనుము ముసురు ముంచు కొచ్చెర! || మేలుకొనుము|| అనుపల్లవి. దేశ మాత దీన స్ధితి కనులార జూడర! మూసుకొన్న కనులు తెరచి మంచి మార్గ మెంచర! || మేలుకొనుము|| 1. దేశంపై పడ్డారు దురాత్ములు ఎందరో వీశ మంత దయలేక చేసారు హింసలు కాసులతో "అభిమానం' కొల్ల గొట్ట కెళ్ళారు దాసులుగ మారిన మన దీన చరిత గాంచర! || మేలుకొనుము|| 2. పురషోత్తమునితో పోరిన అంబి అను ధూర్తడు, ధీర పృధ్వీ రాజుపై పగబట్టిన జయచంద్రుడు పర దేశపు వారి తోటి పొత్తు చేయు దుర్మార్గులు, ఏరిగినచో ఈనాడు ఎందరో ఉన్నారుర. || మేలుకొనుము|| 3. కులం తోటి, మతం తోటి, భాషా, ప్రాంతం తోటి చీల గొట్టి, విడ గొట్టి, చెలగాటం రేగ గొట్టి తలపులో విషం నింపి, తమ జోబులు నింపుకొనే శిలలాంటి మనసున్న శత్రువులున్నారుర. || మేలుకొనుము|| 4. అన్న దమ్ముల పోరు అన్యులకే మేలుర, కన్న నిజం, ఉన్న నిజం కాంచుమిదే సోదర ఎన్నటికి వెనుబలం ఐకమత్య మొకటేర, వెన్న లాంటి నా మాటలు విని బాగునొందర. || మేలుకొనుము|| చాకలకొండ రమాకాంతరావు Thursday, July 26, 2007 Cincinnati OH USA |
#maa telugu talliki mallepU daMDaa# |