Creative works from Telusuna Members

ఆంధ్రావని వీడిన ఆత్మీయత మారదు

రమాకాంతరావు చాకలకొండ

రాగం: మోహన

ఆంధ్రావని వీడిన ఆత్మీయత మారదు
అందులోన తెలుగు పైన అభిమానం వీడదు. ||ఆంధ్రావని||

1. వెచ్చని ఆకన్న తల్లి వడిలోన ఒరగాలని,
పచ్చని ఆపంటలను కనులార చూడాలని,
నచ్చిన నా జన్మ భూమి నలు దిశల తిరగాలని,
ఎచ్చటో గుండెన ఆశ ఏనాటికి వీడదు. ||ఆంధ్రావని||

2. గోదావరి గర్భంలో జలకాలు ఆడాలని, కృష్ణా
నది తీరాన అమ్మను కని పొగడాలని,
ఆదరించు ఆంధ్రభూమి ఆవకాయ తినాలని,
ఎదలోని నా కోర్కె ఎన్నటికి మారదు. ||ఆంధ్రావని||

3. చెరకు రసం, నవరసాల రసాలను గ్రోలాలని
వరి అన్నం ఉల్లితోటి, గోంగూరతో నలపాలని,
తిరుమలేసు పదములపై తూలి తూలి వాలాలని
మరగున నా మది యాశ మరి ఎన్నడు మారదు. ||ఆంధ్రావని||

రమాకాంతరావు చాకలకొండ
July 25, 2007 Cincinnati OH USA


#maa telugu talliki mallepU daMDaa#

Back to list