కవితకు ప్రాణాలు, కల్పన నయనాలు రవి చోరని చోట చేరు హృదయాలు. ||కవితకు|| 1. ఎదలోన ఎచ్చటో తియ్యని బాధగ, మొదలైన భావమే, మొలకెత్తు కవితగ, నాద మయమై ఎదలో, నిలువెల్ల చెలరేగి మోదమును పంచును మరులొలుకు కవిత. ||కవితకు|| 2. ఆరాధనే ఎదలో ఆనంద రూపమై తీరని శోకమే తియ్యని భావనై, సరితల ఉప్పొంగి సంగీత సరళమౌ విరహమను భావనే ఉరకెడి కవిత. ||కవితకు|| 3. బాలునిపై ప్రేమయే భాగవత కావ్యమై వాల్మీకి వేదనే వెలసె రామాయణమై కులుకు లొలుకుచు ఎదలో కమనీయ గానమై తొలికెడి భావనే తియ్యని కవిత. ||కవితకు|| రమాకాంతరావు చాకలకొండ Tuesday, July 31, 2007 Cincinnati OH USA |
#maa telugu talliki mallepU daMDaa# |