Creative works from Telusuna Members

కలసి మెలసి ఉన్న వేళ కష్టాలే ఉండవు

చాకలకొండ రమాకాంతరావు

కలసి మెలసి ఉన్న వేళ కష్టాలే ఉండవు,
తెలుసు కొని జీవించు ఓ తెలుగు సోదర. ||కలసి||

1. కొట్లాడు కొన్న వేళ కరుణ జాలి ఉండవు,
కఠినత్వము ఉన్న వేళ మంచి, చెడు తెలియవు,
పట్టుకొన్న కుందేటికి మూడు కాళ్ళే అన్న వేళ,
పఠించిన చదువులకు అర్ధాలే ఉండవు. ||కలసి||

2. శాంతముతో ఉన్న వేళ స్నేహాలు వీడవు,
సహనముతో ఉన్న వేళ సమస్యలే కలుగవు,
కయ్యాలు లేని వేళ కోపాలు ఉండవు,
తాపాలు లేని వేళ రోషాలే ఉండవు. ||కలసి||

3. దయా బుద్ధి ఉన్న వేళ దౌర్జన్యము లుండవు,
హేయమైన మనసు ఉన్న ఆప్యాయత లుండవు,
మాయ మదిన ఉన్న వేళ మమతలసలు ఉండవు
న్యాయ బుద్ది ఉన్న వేళ నష్టాలే ఉండవు. ||కలసి||

4. బేధాలు లేని వేళ భావనలు మారవు,
రోదనలు లేని వేళ రచ్చ, రభస లుండవు,
మోదముతో ఉండు వేళ మర్యాదలు మారవు
మాధవుని తల్చు వేళ వేదనలే ఉండవు. ||కలసి||

చాకలకొండ రమాకాంతరావు
May 14, 2007 Cincinnati OH USA


#maa telugu talliki mallepU daMDaa#

Back to list