Creative works from Telusuna Members

కంటిని కేశవుని, కమల సంభవుని

చాకలకొండ రమాకాంతరావు

పల్లవి. కంటిని కేశవుని, కమల సంభవుని, ము
క్కంటి రూపుడగు మా వేంకటేశుని. ||కంటిని||

అనుపల్లవి. కంటి సృష్టి, స్ధితి ప్రళయ కారకుని,
కంటి త్రైమూర్తి యగు తిరుమల నాధుని. ||కంటిని||

1. అండజ, క్షీరజ, అవని, జల, గగన చర, బ్ర
హ్మాండ భాండముల నుండు ప్రాణుల గన్న,
మెండు సృష్టికి మూల కారణ కారిని
నిండుగ కంటిని నేడు శ్రీపతిని ||కంటిని||

2. జనని జనకుని రూపు జగతికే తానై, క
మ్మని ప్రేమను కడుపార పంచి,
అన్న పానములను అందరికి అందించు
అన్న దాత మా వేంకటపతిని. ||కంటిని||

3. రోగములు, రొప్పులు, బాధలతో నలుగుచు
జగములో ఎన్నెన్నో వేదనలు చెందెడి,
భగము దేహము గొని కొత్తది అందించు
శంకరుని శ్రీకరుని శ్రీ శ్రీనివాసుని. ||కంటిని||

చాకలకొండ రమాకాంతరావు
May 15, 2007 Cincinnati OH USA



#maa telugu talliki mallepU daMDaa#

Back to list