Creative works from Telusuna Members

దయజూప తగువాడనా ? ఓ దశరధ రామ!

రమాకాంతరావు చాకలకొండ

పల్లవి. దయజూప తగువాడనా ? ఓ దశరధ రామ!
దయజూప తగు వాడనా ? ||దయ||

అనుపల్లవి. మాయ నాటకమందు, మలినము లంటిన నేను ||దయ||

1. నియమములు తప్పితి, న్యాయము మరచితి,
కాయ సౌఖ్యము కొరకు కలుషములు జేసితి,
కయ్యములు చేసితి, కోపములు జూపితి
నెయ్యము విడనాడి ఎన్నో నిష్ఠురము లాడితి. ||దయ||

2. దయ విడనాడితి, దురితములు చేసితి,
భయ భక్తులు వీడి, భీకరము చేసితి,
నయముగ నీ కొలువు, నియతిని మరచితి
రయముగ రాక్షస కృత్యములు చేసితి. ||దయ||

3. జగమున ప్రేమను భావము మరచితి,
వగలోన పడి ఎన్నో వాద్యములు చేసితి
నగరాజ ధర సప్త నగాగ్ర పుర వాస
తగుదున నీ దయకు త్యాగరాజ వినుత. ||దయ||

రమాకాంతరావు చాకలకొండ
May 13, 2007 Cincinnati OH USA


#maa telugu talliki mallepU daMDaa#

Back to list