అబ్బునా అందరికి వైరాగ్యము, అప్పడి దయలేక యీ భాగ్యము. ||అబ్బునా|| 1. చంచల చిత్తమున, చపల భావములతో, వంచన వేషాలు వేయు మానసములో, సంచిత కర్మల సారధ్య రధములో యించుక హరి భక్తి లేని హృదయములో. ||అబ్బునా|| 2. కాంచన, కాంతల కలుష ఆశలు నిండి, పంచ పాతక భ్రష్ట పాప హృదయములో మంచిని మైమరచి మోహమున మ్రగ్గెడి, యించుక దయ లేని ఈ జీవి మనసులో. ||అబ్బునా|| 3. ఎంచి ఆ హరిపదము మంచిని చేయుచూ, పంచి తన కున్నది పరుగురికి ప్రేమతో తుంచుకొని ఆశలు తత్వమును ఎరిగిన మంచి మనిషికి తప్ప మాధవుని కృపతో ||అబ్బునా|| రమాకాంతరావు చాకలకొండ May 12, 2007 Cincinnati OH USA |
#maa telugu talliki mallepU daMDaa# |