Creative works from Telusuna Members

ఇది ఈశ్వర కృత ఇంపైన గీతము

రమాకాంతరావు చాకలకొండ

ఇది ఈశ్వర కృత ఇంపైన గీతము
ఇది శారద రచిత సొంపైన గానము. ||ఇది||

1. ఇది నాట్య, నృత్యముల కనువైన తాళము,
ఇది గాన కోవిదుల గురుతైన రాగము,
ఇది రాగ రంజిత అనురాగ యోగము
ఇది కవిత లందించు కమ్మని ఫలము. ||ఇది||

2. ఇది బోధ గ్రంధముల బహుదివ్య సూత్రము,
ఇది సిరుల నందించు సాధక మంత్రము,
ఇది సర్వ శాస్త్రముల సులభ సారాంశము
ఇది చిత్ర ,శిల్పములు అందించు భాష్యము. ||ఇది||

3. ఇది పద కవితలకు పట్టాభిషేకము
ఇది నాట్య విన్యాస నిరుపమ విలాసము,
ఇది నారదాదులకు నచ్చిన గానము
ఇది వేద మంత్రముల వివరణ సారము. ||ఇది||

4. ఇది మోద మందించు మహదివ్య మార్గము,
ఇది ఆది కందము అందరికి మూలము,
ఇది వేంకటాద్రిన వెలిగేటి దీపము
ఇది విశ్వ ప్రాణులకు ఆధారభూతము. ||ఇది||

రమాకాంతరావు చాకలకొండ
May 11, 2007 Cincinnati OH USA


#maa telugu talliki mallepU daMDaa#

Back to list