Creative works from Telusuna Members

వరలక్ష్మీవ్రత శుభ సందర్భంగ శ్రీలక్ష్మి అందరికి శుభములిచ్చునుగాక

చాకలకొండ రమాకాంతరావు


వర లక్ష్మిగ యీమె వరములను యిచ్చు,
శ్రీ లక్ష్మిగ యీమే సిరుల నందించు,
హరి ఉరమున వెలయు అలమేలు మంగగ,
కొలిచేటి వారల కోర్కెలు తీర్చు. ||శ్రీలక్ష్మి||

1. తొలుత వేదవతి యీతరుణీ లతాంగి, వ
రలు పద్మాక్షుని వరముల పుత్రి ,
జలజాయ తాక్షిణి జానకి దేవి
అలమేలుమంగమ్మ ఐశ్వర్య మిచ్చు. ||శ్రీలక్ష్మి||

2. వేంకటేశుని దేవి విశ్వజనని యీమే
పంకజాసని సాధ్వి, పరమ కరుణా మూర్తి,
శంకర, నారద, సుర సన్నుత యీమే, నెల
వంక సోదరి నిధులు సమకూర్చు. ||శ్రీలక్ష్మి||

3. వ్రతముచేసిన చాలు వెతలు తొలగించు,
సతతము కొలచిన శుభములు యిచ్చు,
మాత మహాలక్ష్మి మంగళ రూపిణి, కొ
రతలన్నీ తీర్చి కామితార్ధములిచ్చు. ||శ్రీలక్ష్మి||

4. సీతమ్మగ యీమే శుభము లందించు, జల
జాత శ్రీలక్ష్మి జయములు యిచ్చు,
మాత పద్మావతి మహభాగ్యమిచ్చు, వర
దాత వరలక్ష్మీ విప్పత్తు తీర్చు. ||శ్రీలక్ష్మి||

చాకలకొండ రమాకాంతరావు
August 23, 2007 Cincinnati, OH USA


#maa telugu talliki mallepU daMDaa#

Back to list