రాగం: రీతిగౌళ పల్లవి. సప్తశైలములందు సుఖముగా వశియించు, శ్రీనివాస! నీవే మాకు ఆశ, అనుపల్లవి. దాసులను దయతోటి పోషించు ఓదేవ! , నీపద సేవలే మాకు త్రోవ. ||సప్తశైల|| 1. అలమేలు మంగమ్మ, అలవోకగా చూడ, వూహలలో కులికేటి వేంకటేశ! కలికి కమలాకాంత కనుసన్నల మెలగి, లోకములు కాచేటి శ్రీనివాస! ||సప్తశైల|| 2. చెలియ పద్మావతి చక్కదనములు మెచ్చి, చెంగు పట్టుక తిరుగు శ్రీనవాస! వలచి వేంకటగిరి శిఖరము వదిలేసి, మంగపురముకు వచ్చుమోహనాంగ! ||సప్తశైల|| 3. అమ్మ ఆండాళమ్మ అందించు వనమాల, యిమ్ముగ ధరియించు వేంకటేశ కొమ్మ నాంచారమ్మ కొంగున దాగిన, కమ్మని నా సామి శ్రీనివాస! ||సప్తశైల|| రమాకాంతరావు చాకలకొండ May 7 2007 Cincinnati OH USA |
#maa telugu talliki mallepU daMDaa# |