వ్రాయాలి ఒక గీతం రాగాలు పలుకగ, రా మయ్య తండ్రిపై భక్తి రసము చిందగ. || వ్రాయాలి || 1. త్యాగయ్య పాటలా తేనియలు చిందగ, నాగ శాయిపై ఎదలో నయగారము నిండగ, వగ పడి మా వెంకనిపై ఒక ప్రేమ కవితగ, ఎగయాలి యీవేళ ఎదనుండి ఇంపుగ. || వ్రాయాలి || 2. రామదాసు కీర్తనల, నవ రసాలు పొంగగ, సీ తమ్మ పతిపైన సరసత నిండగ, కమ్మగ నా ఎదలోన కవితల వెలయగ, ఇమ్ముగ యీ వేళ వ్రాయాలి సొంపుగ. || వ్రాయాలి || 3. అన్నమయ్య పాటలా అమృతము కురయగ, వెన్నునిపై ఒక గీతం వరదలా పొంగగ, తన్మయమై పోవగ, తియ్యగ, భక్తిగ, భా వనతో భక్తిగ అందరు పాడగ. || వ్రాయాలి || రమాకాంతరావు చాకలకొండ May 6 2007, Cincinnati OH USA |
#maa telugu talliki mallepU daMDaa# |