Creative works from Telusuna Members

స్థిరము లేని మనసే చింతలకు మూలము

రమాకాంతరావు చాకలకొండ

స్థిరము లేని మనసే చింతలకు మూలము,
హరిని కొల్వని మనసు, హీనము,హేయము. || స్థిరము||

1. ధరణిలో హరి రూపు తల్చని మానసము,
దారిద్య, దుఃఖ, భవ శృంఖలా పీడనము,
మరుని తండ్రిని మదిన కొల్వని జీవనము
మరణ బాధలతోటి మ్రగ్గుట తధ్యము. || స్థిరము||

2. సిరి నాధు మది నెరిగి సేవింపని బ్రతుకు,
ఝర్ఝర రోగముల జరా పీడితము,
నారయణ నుతులు చేయని జన్మము,
నరక బాధలతోటి మ్రగ్గును నిత్యము. || స్థిరము||

3. తిరుమలేశుని దరి చేరని దేహము,
పరమ దారిద్యములు పొందుట సత్యము,
హరి వేంకటాపతిని ఎరుగని హృదయము
బురదతో నిండిన పెద్ద గోయి సమానము. || స్థిరము||

రమాకాంతరావు చాకలకొండ
May 5 2007, Cincinnati OH USA


#maa telugu talliki mallepU daMDaa#

Back to list