Creative works from Telusuna Members

విన్న వించెదనయ్య వేంకటేశ వినతి

రమాకాంతరావు చాకలకొండ

విన్న వించెదనయ్య వేంకటేశ వినతి, నను
కన్న నాతండ్రి కరుణించ వయ్యా! ||విన్న||

1. కోరితిని కోర్కెలు కమ్మని కలగని
నెరవేర్చమని నిన్ను నిరతము వేడితి
తీరక యవి ఎన్నో తాపములు చెందితి,
దూరి నిను మదిలోన దైన్యము నొందితి. ||విన్న||

2. నరక కూపము బ్రతుకు నిజమని భావించి
జర, వ్యాధుల నొందు కాయమునే నమ్మితి
సిరులు, సింగారములే సర్వమని తలపోసి
ధరణిలో ఎన్నెన్నో దైత్యములు చేసితి. ||విన్న||

3. బ్రతుకు పరుగులతోటి బాగుగ నలసితి,
చితుకు దేహము పైన చపలత వీడితి
వెతికి నీ పాదముల ఆశ్రయమే కోరితి
నుతులు చేసెదనయ్య నను బ్రోవవయ్యా! ||విన్న||

రమాకాంతరావు చాకలకొండ
May 4, 2007 Cincinnati OH USA


#maa telugu talliki mallepU daMDaa#

Back to list